దశర , నవరాత్రులు..ఈరోజు నుండి ప్రారంభం. ఈ తొమ్మిదిరోజులు అమ్మవారు మనకు తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తారు. ఈ అవతారాలను వివిధ ప్రాంతాలలో వేర్వేరు రోజులలో పుజిస్తారు ( అన్ని ప్రాంతాలలో ఒకే అలంకారం ఒకే రోజు వుండాలని లేదు )
మొదటిరోజు --శ్రీలక్ష్మి అమ్మవారు
రెండవరోజు --శ్రీ గాయత్రి అమ్మవారు
మూడవరోజు ---శ్రీ అన్నపూర్ణ అమ్మవారు
నాల్గవరోజు ---శ్రీ లలిత అమ్మవారు
ఐదవరోజు ---శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారు
ఆరవరోజు ---శ్రీ సరస్వతి అమ్మవారు
ఏడవరోజు --శ్రీ దుర్గాదేవి అమ్మవారు
ఎనిమిదవరోజు ---శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు
తొమ్మిదవరోజు ---శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు
దశ అంటే పది, హర అంటే సంహరించడం. ఈ తొమ్మిదిరోజులలో అమ్మవారు "శక్తి"రూపం లో దుష్టసంహారం చేసింది.
పదవరోజు ఐన దశమి ( తెలుగు కాలెండరు ప్రకారం పక్షం(పదిహేనురోజులు) లో పదో రోజు ) నాడు విజయం సాధించింది. దానికి గుర్తుగా మనం విజయదశమి ని జరుపుకొంటాము.
ఈ నవరాత్రులలో కొన్ని ప్రాంతాల వారు బొమ్మలకొలువు కుడా పెడతారు. ( నెల్లూరు,ఒంగోలు....)
మహిషి అనే రాక్షసుని సంహారం కొరకు దుర్గాదేవి కి, దేవతలు అందరు తమ శక్తిని ఇచ్చి, తామూ ఈ తొమ్మిది రోజులు బొమ్మలరూపం లో (వారి శక్తి అంతా అమ్మవారు తీస్కోన్నారు కావున) ఉంటారు.
Subscribe to:
Post Comments (Atom)
1 వినదగు నెవ్వరు చెప్పిన..:
nice.........ekkada nunchi collect chesaru e topics chala bagunnayi :)
Post a Comment