Saturday, July 9

శ్రీవిష్ణు సహస్రనామము (19 - 37)

19. మహా బుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహద్యుతిః
అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాధ్రి దృక్

మహాబుద్ధిః = గొప్ప బుద్ధి కలవాడు
మహావీర్యో = గొప్ప పరాక్రమము కలవాడు
మహాశక్తిః = గొప్ప శక్తి కలవాడు
మహాద్యుతిః = గొప్ప తేజము కలవాడు
అనిర్దేశ్యవపుః = వర్ణింపలేని ( నిర్దేశించలేని) శరీరము కలవాడు
శ్రీమాన్ = లక్ష్మీ సహితుడు
అమేయాత్మా = అవ్యక్తుడు
మహాద్రిధృక్ = గొప్పదియగు మందర / గోవర్ధన పర్వతమును ధరించినవాడు

20. మహేష్వాసో మహీభర్తా శ్రీనివసః సతాం గతిః
అనిరుద్ధ స్సురానందో గోవిందో గొవిదాం పతిః

మహేష్వాసః = గొప్పదైన అమ్ములపొది కలవాడు
మహీభర్తా = భూదేవి భర్త అయినవాడు
శ్రీనివాసః = లక్ష్మి నివసించును కనుకనే శ్రీనివాసము
సతాంగతిః = ఆత్మఙ్ఞానము కలవారికి శరణ్యుడు
అనిరుద్ధః = ఎవరిచేత ఆపుటకు వీలులేనివాడు
సురానందొ = సుర - ఙ్ఞానమును ఇచ్చువాడు, అనందో - ఆనందించువాడు
గోవిందో = గో - భూమి, బానము, గోవు, విందః - పొందువాడు
గోవిందాంపతిః = వేదములు తెలిసినవారికి, జలచరములకు పతి అగువాడు

21. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః

మరీచిః = ఇతని చేత తమొగుణము, చీకటి చంపబడుచున్నది
దమనః = దమనుడు అను రాక్షసుడిని సం హరించినవాడు
హంసః = దోషహీనుడు, సారవంతుడు కనుక హంసుడు
సుపర్ణః = ఆనందస్వరూపుడు
భుజగోత్తమాః = పాములలో శ్రేష్ఠమైన దానిని శయ్యగా గలవాడు / శేషశయనుడు
హిరణ్యనాభః = హిరణ్యుడు అను పేరు గల రాక్షసుడిని నాశనమొనరించినవాడు
సుతపాః = మంచి ఙ్ఞానము కలవాడు
పద్మనాభః = చతుర్ముఖుడిని బొడ్డు యందు కలవాడు
ప్రజాపతిః = ప్రజలకు అధిపతి

22. అమృత్యు స్సర్వదృక్ సింహః సంధతా సంధిమాన్ స్థిరః
అజో దుర్మర్షణ శ్శాస్తా విశృతాత్మా సురారిః

అమృత్యుః = మృత్యువులేనివాడు
సర్వదృక్ = అన్ని వైపులా చూచువాడు
సింహః = హింసను నశింపచేయువాడు
సంధాతా = బాగుగా ధరించువాడు
సంధిమాన్ = సుగ్రీవుడు, విభీషణుడు తో సంధి కుదుర్చుకొనడం వలన ఈ పేరు వచ్చింది
స్థిరః = అనాది, నిత్యుడు అగుటవలన స్థిరుడు
అజః = పుట్టుకలేని వాడు
దుర్మర్షణః = సహించుటకు శఖ్యము కానివాడు
శాస్తా = జగత్తును శాసించువాడు
విశ్రుతాత్మా = ప్రసిద్ధమైన స్వరూపము కలవాడు
సురారిః = రాక్షసులను సంహరించువాడు

23. గురుర్గురు తమోధామ స్సత్యః సత్యపరాక్రమః
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధిః

గురువుః = ఉపదేశము చేయువాడు
గురుతమః = మిక్కిలు వ్యాప్తుడైనవాడు
ధామః = తేజోరూపం కలవాడు
సత్యః = సత్య, ధర్మములే రూపముగా కలిగినవాడు
సత్యపరాక్రమః = సత్యమైన పరాక్రమము కలిగినవాడు
నిమిషః = నిమి అను రాజునకు బలమును ఇచ్చినవాడు
అనిమిషః = కనురెప్పపాటు కాలం కూడ భక్తులను వదలకుండా కాపాడువాడు
స్రగ్వీ = స్రక్ – పూలదండ, అది కలవాడు స్రగ్వీ
వాచస్పతిః = వేదములకు అధిపతి
ఉదారధిః = దోషరహితమైన బుద్ధి కలవాడు

24. అగ్రణీ ర్ర్గామణిః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్రపాత్

అగ్రణీః = మార్గదర్శి
గ్రామణీః = కర్మఫల ప్రదాత
శ్రీమాన్ = లక్ష్మీ సమేతుడు
న్యాయః = మిక్కిలి లాభము కలవాడు
నేతా = ప్రాణులకు యోగ్యమైన ఫలములు ఇచ్చువాడు
సమీరణః = లక్ష్మీదేవి చేత బాగుగా స్తుతింపబడువాడు
సహస్రమూర్ధా = వెయ్యి తలలు కలవాడు
విశ్వాత్మా = ప్రపంచమును నియమించువాడు
సహస్రాక్షః = వెయ్యి కనులు కలవాడు
సహస్రపాత్ = వెయ్యి పాదములు కలవాడు

25. ఆవర్తనోనివృతాత్మా సంవృత స్సంప్రమర్దనః
అహస్సంవర్తకో వహ్ని రణిలో ధరణీ ధరః

ఆవర్తనః = మేలైన నడవడిక కలవాడు
నివృతాత్మా = ప్రళయము ఎవరిచేత నివృతి చేయబడునో అతను
సంవృతః = గుణసంపూర్ణుడు
సంప్రమర్దనః = రాక్షసులను మర్ధించువాడు
అహస్సంవర్తకః = భక్తులను విడువనివాడు
వహ్నిః = జగత్తును వహించువాడు
అనిలః = ఇంకొకరి యందు తాను వినీలమగుట జరుగదు కనుక అతను అనిలుడు
ధరణీధరః = భూమిని ధరించువాడు

26. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృ గ్విశ్వభు గ్విభుః
సత్కర్తా సత్కృతిః సాధుర్జహ్ను ర్నారాయణో నరహః

సుప్రసాదః = ఉత్తమమైన సుఖము కలవాడు
ప్రసన్నాత్మా = ప్రసన్నమైన మనస్సు కలవాడు
విశ్వధృక్ = విశ్వమును ధరించువాడు
విశ్వభుక్ = విశ్వమును అనుభవించువాడు
విభుః = వివిధ రూపుడుగా వ్యాపించినవాడు
సత్కర్తా = రాక్షశ నాశకుడు
సత్కృతిః = ఉత్తమమైన లక్షనములు కల “కృతి” అను భార్య కలవాడు
సాధుః = ఇతరుల కార్యములు సాదించువాడు
జహ్ను: = అయోగ్యులను విడుచువాడు
నారాయణః = నారమనగా మానవుల సమూహము, అవరిచే నమస్కరింపదగినవాడు
నరః = నిర్వికారుడు

27. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృ చ్చుచిః
సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిధః సిద్ధిసాధనః

అసంఖ్యేయః = లెక్కింపలేని గుణములు కలవాడు
అప్రమేయాత్మా = కొలతకు అందని
విశిష్టః = విశేషముగా
శిష్టకృత్ = ఘటనాఘటనా సమర్ధుడు
శుచిః = పరిశుద్దుడు
సిద్ధార్ధః = ఈప్సితార్ధుడు
సిద్ధిసంకల్పః = భక్తుల కోరికలను తీర్చువాడు
సిద్ధిదః = యోగ్యులకు మోక్షమును ఇచ్చువాడు
సిద్ధిసాధనః = మోక్షరూపమైన ఫలమును ఇచ్చువాడు

28. వృషాహి వృషబో విష్ణు ర్వృషపర్వా వృషోదరః
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః

వృషాహి = ధర్మముచేత వ్యాపించువాడు
వృషభః = వర్షించువాడు
విష్ణుః = సంసారరూప ప్రవాహము లేనివాడు
వృషపర్వా = వృష – పుణ్యము, దనికి సాధనములైన అమావాశ్య మొదలగు పర్వములు కలవాడు
వృషోదరః = వృషొద – గంగోదకము, రః – ఇచ్చువాడు
వర్ధనః - అభివృద్ధి పరచువాడు
వర్ధమానః = నిత్యము అభివృద్ధి చేందువాడు
వివిక్తః = జగత్తు కంటే భిన్నుడు
శ్రుతిసాగరః = సృతిసా + ఆగరః – వేదములను ఇచ్చినవాడు

29. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః

సుభుజః = మనిచి భుజము కలవాడు
దుర్ధరః = ధరించుటకు అశక్యమైనవాడు
వాగ్మీ = మహావక్త
మహేంద్రః = గొప్పవాడైన ఇంద్రుడు
వసుదః = ధనము
వసుః = అన్నిచోట్ల నివసించువాడు
నైకరూపః = అనేకరూపములు కలవాడు
బృహద్రూపః = పెద్దరూపం కలవాడు
శిపివిష్టః = కష్ఠములయందు అగ్నిరూపంలో అంతర్యామిగా ఉండువాడు
ప్రకాశనః = భక్తులను ప్రకాశింప చేయువాడు

30. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః
బుద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశు ర్భాస్కరద్యుతిః

ఓజస్తేజోద్యుతిధరః = పదావష్టంబనశక్తి, ప్రతాపము, ప్రకాశము కలవాడు
ప్రకాశాత్మా = ప్రకాశస్వరూపము కలవాడు
ప్రతాపనః = ఎక్కువగా వ్యాపించి ఉన్న నీటి సమూహమును ఆవిరి రూపమున తీసుకొనుపోవువాడు
బుద్ధః = అభివృద్ధినందినవాడు
స్పష్టాక్షరః = వేదప్రతిపాదకములైన అక్షరములు కలవాడు
మంత్రః = మననము చేత రక్షించువాడు
చంద్రాంశుః = చంద్రునకు తేజమును ఇచ్చువాడు
భాస్కరద్యుతిః = సూర్యునికి కాంతిని ఇచ్చువాడు

31. అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః
ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః

అమృతాం సూద్భవః = అమృతమువంతి చంద్రుడి యొక్క కిరణములనుండి ఉద్భవించినవాడు
భానుః = ప్రకాశించువాడు
శశబిందువుః = శశుడు = సుఖస్వరూపుడు, బిందుః = ఙ్ఞాని
సురేశ్వరః = దేవతలకు ప్రభువు
ఔషధం = తాపత్రయాఙ్ఞులకు అవ్షది వంటివాడు
జగతస్సేతుః = సంసారసాగరమును దాటింపచేయువాడు
సత్యధర్మపరాక్రమః = సత్య ధర్మములు ఆచరించుటలో పరాక్రమము కలిగినవాడు

32. భూత భవ్య భవన్నధః పవనః పావనోనలః
కామః కామకృత్ కాంతః కామః కామప్రదః ప్రభుః

భూతభవ్యభవన్నధః = భూతములచేత, సంసారులచేత, అఙ్ఞానులచేత ప్రార్ధింపబడువాడు
పవనః = రాజపోషకుడు
పావనః = పవిత్రము చేయువాడు
అనలః = అనివార్యుడు
కామహ = కోరికను చంపువాడు
కామకృత్ = భక్తకామదుడు
కాంతః = రాక్షసులకు దుఖదాయకుడు
కామః = జనులచే కొరబడువాడు
కామప్రదః = కోరికలను తీర్చువాడు
ప్రభుః = ప్రకర్షముగా ఉండువాడు

33. యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజి దనంతజిత్

యుగాదికృత్ = యుగములను విభజించి చూపువాడు
యుగావర్తః = యుగములను పునరావృతం చేయువాడు
నైకమాయః = అనేకమైన కోరికలు కలవాడు
మహాశనః = గొప్ప భోజనము కలవాడు
ఆదృశ్యః = కనపడనివాడు
అవ్యక్తరూపః = స్పష్టముగా లేని రూపం కలవాడు
సహస్రజిత్ = వెయ్యి మంది రాక్షసులను గెలుచువాడు
అనంతజిత్ = అనంతమైన వస్తువులను పొందువాడు

34. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః
క్రోధహా క్రోధ కృత్కర్తా విశ్వభాహు ర్మహీధరః

ఇష్టో = అందరికి ఇష్టమైనవాడు
విశిష్టః = భక్త శాసకుడు
శిష్టేష్టః = శిష్టులచేత పూజింపబడేవాడు
శిఖండీ = బాల్యమునందు శిఖను ముడి వేసినవాడు
నహుషః = రాక్షసులను బంధించువాడు
వృషః = భక్తుల ఇష్టమును వర్షించువాడు
క్రోధః = దయాస్వరూపుడు కావున క్రోధమును చంపువాడు
క్రోధకృత్ = హింస నుండి దూరము చేయువాడు
కర్తా = స్వతంత్రుడు
విశ్వబాహుః = వాయువును సృష్టించినవాడు
మహీధరః = భూమిని ధరించువాడు

35. అచ్యుతః ప్రధితః ప్రాణః ప్రాణవో వాసవానుజః
అపాం నిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః

అచ్యుతః = నాశము లేనివాడు
ప్రధితః = ప్రసిద్ధుడు
ప్రాణః = గొప్పవారిని తనలోకమునకు తీసుకొనిపోవువాడు
ప్రాణదః = ప్రాణములను ఇచ్చువాడు
వాసవానుజః = వాసవుని అనుజుడు – వామనుడు
అపాం నిధిః = దేవతలకు ఆశ్రయం ఐనవాడు
అధిష్ఠానం = జగన్మూలక కారకుడు
అప్రమత్తః = నిత్య జాగురుకుడు
ప్రతిష్ఠితః = ప్రతిష్ఠ కలవాడు

36. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః
వాసుదేవో బృహత్భాను రాదిదేవః పురందరః

స్కందః = సంసార తాపత్రయమును శొషింపచేయువాడు
స్కందధరః = కుమారస్వామిని ధరించినవాడు
ధుర్యః = బరువును మోయువాడు
వరదః = మోక్షరూపమైన వరమును ఇచ్చువాడు
వాయువాహనః = వాయువును వాహనముగా కలవాడు
వాసుదేవః = వసుదేవుని కుమారుడు
బృహత్భానుః = సహస్ర కిరణములు కలవాడు
ఆదిదేవః = అన్నింటికి కారణమైనవాడు
పురందరః = శతృవును చీల్చువాడు

37. అశోక స్థారణః తారః శూరః శౌరి ర్జనేశ్వరః
అనూకూల శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః

అశోకః = శోకములేనివాడు
తారణః = సూర్యునికి సంబంధించినవాడు
తారః = తరింపచేయువాడు
శూరః = సుఖమును పెంచువాడు
శౌరిః = శూరుని వంశమునందు జనించినవాడు
జనేశ్వరః = జనులకు ఈశుడు
అనుకూలః = తీర్ధములందు, క్షేత్రములందు నివసించువాడు
శతావర్తః = దుష్టులకు కష్టకారకుడు
పద్మ = పద్మము కలవాడు
పద్మ నిభేక్షణః = పద్మ సమానమైన కనులు కలవాడు

0 వినదగు నెవ్వరు చెప్పిన..: