Friday, July 15

శ్రీవిష్ణు సహస్రనామము (56 - 74)

56. అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః
ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః
అజః - బ్రహ్మకు తండ్రి
మహార్హః = పూజాదులకు తగినవాడు
స్వాభావ్యః = సంకల్పసిద్ధుడు
జితామిత్రః = శతృవులను గెలిచినవాడు
ప్రమోదనః = ఆనందమును అనుభవించువాడు
ఆనందః = ఆనంద స్వరూపుడు
నందనః = అనందింపచేయువాడు
నందః = సమృద్ధి కలవాడు
సత్యధర్మః = సత్యమునే ఙ్ఞానముగా కలవాడు
త్రివిక్రమః = 3 అడుగులు కలవాడు, వామనుడు

57. మహర్షిః కపిలాచార్యః కృతఙ్ఞో మేదినీపతిః
త్రిపది స్త్రీ దశాధ్యక్షో మహాశృఙ్గః కృతాంతకృత్
మహర్షిః = మహాత్ముడైన ఋషి
కపిలాచార్యః = కపిలాచార్యుడు
కృతఙ్ఞః = చేసినదానిని తెలుసుకొనువాడు
మేదినీపతిః = భూపతి
త్రిపదః = గాయత్రి యొక్క 3 పాదములచే ప్రతిపాదించబడువాడు
త్రిదశాధ్యక్షః = దేవనాయకుడు
మహాశృగః = గొప్ప ప్రాధాన్యము కలవాడు
కృతాంతకృత్ = మృత్యువును నశింపచేయువాడు

58. మహావరాహో గోవిందః సుషేణః కంకాంగదీ
గుహ్యో గభీరో గహనో గుప్త శ్చక్ర గదాదరః
మహావరాహః = రాక్షశ శ్రేష్ఠులను చంపువాడు
గోవిందః = నారాయణుడు
సుషేణః = మంచి సైన్యము కలవాడు
కనకాంగదీ = బంగారంతో చేసిన అంగదములు అను ఆభరణములు బాహువులందు కలవాడు
గుహ్యః = గుహుడిచే పూజింపబడు వాడు, రాముడు
గభీరః = గంభీరుడు
గహనః = తెలుసుకొనుటకు వీలులేనివాడు
గుప్తః = గుప్తముగా ఉండువాడు
చక్రగదాధరః = చక్రమును, గదను ధరించినవాడు

59. వేధాః స్వాంగోజితః కృష్ణో ధృడః సంకర్షణోచ్యుతః
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః
వేధాః = విశేషణముగా ధారణ చేయువాడు
స్వాంగః = చైతన్యస్వరూపి
అజితః = అపజయములేనివాడు
కృష్ణః = కృష్ణుని రూపం దాల్చినవాడు
దృడః = దార్ఢ్యము కలవాడు
సంకర్షణః = భక్తుల పాపములను హరించువాడు
అచ్యుతః = నాశము లేనివాడు
వరుణః = ఆవరించి ఉండువాడు
వారునః = శ్రేష్ఠుడు
వృక్షః = భక్తుల కోర్కేలు తీర్చేడి కల్పతరువు
పుష్కరాక్షః = తామరముల వంటి కనులు కలవాడు

60. భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుద్ధః
ఆదిత్యో జ్యోతి రాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః
భగవాన్ = భగవంతుడు
భగహా = భగ - రాక్షసుల యొక్క భాగ్యములను, హా-హరించువాడు
ఆనందీ = ఆనందము కలవాడు
వనమాలీ = పాదమువరకు వ్రేలాడుచున్న తులసిమాలను ధరించినవాడు
హలాయుధః = నాగలి ఆయుధముగా కలవాడు
ఆదిత్యః = అనాదినుండి ఆనంద, ఙ్ఞానములు కలవాడు
జ్యోతిరాదిత్యః = సూర్యమండల మధ్యవర్తి
సహిష్ణుః = ఓర్పు కలవాడు
గతిసత్తమః = శరణ్యుడు

61. సుధన్వా ఖండపరశు ర్దారుణో ద్రవిణప్రదః
దివస్పృ క్సర్వదృ గ్వ్యాసో వాచస్పతి రయోనిజః

సుధన్వా = శోభనమైన ధనస్సు కలవాడు
ఖండపరశుః = శివునిచే ప్రయోగించబడిన గొడ్డలిని విరగగొట్టినవాడు
దారుణః = చీల్చి చండాడువాడు
ద్రవిణప్రదః = హరిభక్తులకు సుఖమును ప్రసాదించువాడు
దివిస్స్పృక్ = శ్వేతద్వీపము
సర్వదృక్ = అంతటిని చూచువాడు
వ్యాసః = విశిష్టుడు
సర్వదృగ్వ్యాసః = అన్ని వైపులకు చూచువాడు
వాచస్పతిః = సకల వాక్కులకు, మనసులకు నాయకుడు
అయొనిజః = పుట్టుకలేనివాడు

62. త్రిసామా సామగ స్సామ నిర్వాణం భేషజం భిషక్
సంన్యాసకృ చ్చమ శ్శాంతో నిష్ఠా శాంతిః పరాయణం

త్రిసామా = నిధన, ఉద్గీధ, ప్రతీహారములు అను పేరు గల సామములు కలవాడు
సామగః = బ్రహ్మ భార్య ఐన వాక్దేవి
సామ = సర్వభూతములయందు సమత్వం కలవాడు
నిర్వాణం = ప్రాకృత శరీరములేనివాడు, దివ్యుడు
భేషజం = సంసార రోగమునకు ఓషధి వంటివాడు
భిషక్ = వైద్యుడు
సంన్యాసకృత్ = సం-బాగుగా, న్యాస-దోషములు విడుచుపని, కృత్-చేయువాడు
శమః = ఆనందస్వరూపుడు
శాంతః = పరమానందమును అనుభవించువాడు
నిష్ఠాః = స్తిరత్వము కలవాడు
శాంతిః = ఉన్నతమైన సుఖ స్వరూపుడు
పరాయణః = పర-ముక్తులు, ఆయణః-ఆశ్రమమైనవాడు

63. శుభాంగ శ్శంతిద స్స్రష్టాకుముదః కువలేశయః
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః

శుభాంగః = శుభమైన అంగములు కలవాడు
శాంతిదః = మోక్షమును ఇచ్చువాడు
స్రష్టా = జగత్తును సృష్టించినవాడు
కుముదః = కు-భూమియందు, ముదః - సంతోషించువాడు
కువలేశయః = కు-భూమియొక్క, బలే - బలము కొరకు (శ్వేత ద్వీపమునందు), శయః - పరుండువాడు
గో+హితః = గో -ఆవులకు, వేద రూపమందున్న వాక్కులకు వరుసగా కృష్ణుడు,వ్యాసుడు మొదలగు రూపములతో మేలుచేయువాడు
గోపతిః = ఆవులు, స్వర్గము, పశువులు, వాక్కు, వజ్రము, దిక్కులు, నేత్రములు, భూమి, జలములకు అధిపతి
గోప్తా = రక్షించువాడు
వృషభాక్షః = వృష - ధర్మముచేత, భ - ప్రకాశించువారు, సజ్జనులు, అక్షః - కృపాదృష్టి కలవాడు
వృషప్రియః = వృష-ధర్మము, ప్రియః-ఇష్టము కలవాడు

64. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృ చ్చివః
శ్రీవత్స వక్షా శ్రీవాసః శ్రీపతిః శ్రీమతామవరః

అనివర్తీ = ఎప్పుడునూ వెనుకడుగు వేయనివాడు
నివృత్తాత్మా = జీవులను తన యందు లీనము చేసుకొనువాడు
సంక్షేప్తా = సం-బాగుగా, క్షేప్తా- బొటనివ్రేలితో దుంధుభి అనే రాక్షసుని శరీరమును విసిరివేసినవాడు, రాముడు
క్షేమకృత్ = క్షేమమును కలిగించువాడు
శివః = మంగళస్వరూపుడు
శ్రీవత్సవక్షాః = శ్రీ-లక్ష్మి తో కూడిన, వత్సః- మహత్వలక్షణములను సూచించు తెల్లని రోమముల సుడి, వక్షాః - వక్షమునందు కలవాడు
శ్రీవాసః = లక్ష్మీ నివాసుడు
శ్రీపతిః = లక్ష్మీ పతి
శ్రీమతాంవరః = సరస్వతి మొదలగు దేవతలలో శ్రేష్ఠుడు

65. శ్రీదః శ్శ్రీశ శ్రీనివాసః శ్శ్రీనిధిః శ్రీవిభావనః
శ్రీధర శ్రీకర శ్రేయః శ్శ్రీమ్మాన్లోక త్రయాశ్రయః

శ్రీదః = సంపదను ఇచ్చువాడు
శ్రీశః = లక్ష్మికి ఎవరివలన సుఖము కలుగునో అతను
శ్రీనివాసః = లక్ష్మియందు అంతర్యామిగా నివసించువాడు
శ్రీనిధిః = శ్రీ-కాంతులు, నిధిః-నిధి
శ్రీవిభావనః = లక్ష్మికి విశేషమైన భావములను తెచ్చువాడు
శ్రీధరః = లక్ష్మిని ధరించినవాడు
శ్రీకరః = శ్రీ-లక్ష్మిదేవిని, కరః - చేతియందు ఉండువాడు
శ్రేయః = స్తుతింపదగినవాడు
శ్రీమాన్ = లక్ష్మి ని కొలుచువాడు
లోకత్రయాశ్రయః = లోకత్రయమునకు ఆశ్రయమైనవాడు

66. స్వక్ష స్స్వఙ్ఞ శ్శతానందో నంది ర్జ్యోతిర్గణేశ్వరః
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్చిన్న సంశయః

స్వక్షః = మంచి ఇంద్రియములు కలవాడు
స్వంగః = శోభనములైన అవయములు కలవాడు
శతానందః = అనంతమైన ఆనందము కలవాడు
నందిః = ఆనందము కలవాడు
జ్యోతిర్గణేశ్వరః = సూర్యాది జ్యోతి సముదాయమునకు నాయకుడు
విజితాత్మా = గరుత్మంతునిచేత పొందబడిన శరీరము కలవాడు
విధెయాత్మా = విధి విషయములందు మనస్సు కలవాడు
సత్కీర్తిః = మంచి కీర్తికలవాడు
చ్చిన్నసంశయః = సర్వ సంశయములను చ్చేదించువాడు

67. ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశ శ్శాశ్వతస్థిరః
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోకనాశనః

ఉత్ + ఈర్ణ = ఉత్కృష్టుడు ఐనవాడు
సర్వతశ్చక్షుః = అన్నివైపులా కన్నులు కలవాడు
అనీసః = ప్రాణులకు ఈశుడు
శాశ్వతః = శతృవులచే విడువబడిన ఆయుధములను పరిహరించి భక్తులకు ప్రాణములను ఇచ్చువాడు
స్థిరః = శత్రువుల యొక్క మార్గమును నివారించువాడు
భూశయః = భూమి యందు పడుకొనువాడు , శ్రీరంగ క్షేత్రములలోవలె
భూషణః = అలకరించువాడు
భూతిః = ఐశ్వర్యరూపుడు
విశోకః = ఎవరివలన దుఖము తొలగిపోవునో అతను
శోకనాశనః = శోకమును నశింపచేయువాడు

68. అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్ధో ప్రతిరధః ప్రధ్యుమ్నో మితవిక్రమః

అర్చిష్మాన్ = కాంతులు కలవాడు
అర్చితః = బ్రహ్మాదులచే అర్చింపబడువాడు
కుంభః = భూమిని ప్రకాశింపచేయువాడు
విశుద్ధాత్మా = విశుద్ధమైన ఆత్మ కలవాడు
విశోధనః = విశేషముగా వేదములను శోధించువాడు
అనిరుద్ధుః = ఎదురులేనివాడు
అప్రతిరధః = ప్రతిపక్షము లేనివాడు
ప్రద్యుమ్నః = మిక్కిలి కీర్తి కలవాడు
అమిత విక్రమః = అమితమైన పరాక్రమము కలవాడు

69. కాలనేమినహా వీర శ్శౌరి శ్శూరజనేశ్వరః
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః

కాలనేమినహా = కాలనేమి అను పేరు కల రాక్షసుడిని చంపినవాడు
వీరః = విశేషముగా
శౌరి = "శుర" కులమున ఉద్భవించినవాడు
శూరజనేశ్వరః = శూర వంశమునందలి రాజు
త్రిలోకాత్మా = త్రిలోకములకు శరీరము వంటివాడు
త్రిలోకేశః = త్రిలోకములకు అధిపతి
కేశవః = క-బ్రహ్మ, ఈశ-ఈశ్వరుడు, వః- వారి వారి విధుల యందు ప్రవర్తింపచేయువాడు
కేశిహా = కేశి అను పేరు కల రాక్షసుడిని చంపినవాడు
హరిః = పాపమును హరింపచేయువాడు

70. కామదేవః కామపాలః కామి కాంతః కృతాగమః
అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరో నంతో ధనుంజయః

కామదేవః = కామదేవుడు - మన్మధుడి వలె ప్రకాశించువాడు
కామపాలః = కోరికలను పాలించువాడు
కామీ = జగత్తు రక్షణ కోరుకొనేవాడు
కాంతః = మనోహరుడు
కృతాగమః = ఎవనిచే పురాణములు మొదలగున్నవి చేయబడినవో అతను , వ్యాసుడు మొదలగు వారు
అనిర్దేశ్యవపుః = ఇటువంటిది, ఇంతది అని చెప్పుటకు వీలులేని శరీరము
విష్ణుః = వి కారం - విశిష్టత్వము, ష కారం- పూర్ణత్వము, ణ కారం- బలము, చివర వచ్చే ఉ కారం, పైన చెప్పిన మూడు గుణములు కలవాడు అని అర్ధము.
వీరః = సమర్ధుడు
అనంతః = నాశము లేనివాడు
ధనంజయః = ధనమును గెలిచినవాడు

71. బ్రహ్మణ్యో బ్రహ్మకృ ద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః
బ్రహ్మవి ద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణ ప్రియః

బ్రహ్మణ్యః = బ్రాహ్మణులకు ప్రియమైనవాడు
బ్రహ్మకృత్ = ఆలోచనాత్మకమైన తపస్సు చేయువాడు
బ్రహ్మా = భక్తులను వృద్ధి పరచువాడు
బ్రహ్మ = జగత్తును సృష్టించినవాడు
బ్రహ్మ వివర్ధనః = వేదమును వ్యాసరూపంలో వర్షింపచేయువాడు
బ్రహ్మవిత్ = వేదమును తెలుసుకొన్నవాడు
బ్రాహ్మణః = వేదముచేత చేరబడువాడు
బ్రహ్మీ = జీవములు తనయందు కలవాడూ
బ్రహ్మఙ్ఞః = బ్రహ్మ ఎవరిని తెలుసుకొనినాడో అతను
బ్రాహ్మణప్రియః = బ్రహ్మను స్తుతించువాడు బ్రాహ్మణుదు/ఙ్ఞాని. అతనిని ఇష్టపడువాడు విష్ణువు

72. మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః
మహాక్రతు ర్మహాయజ్వా మహాయఙ్ఞో మహాహవిః

మహాక్రమః = వేదభావనుడు
మహాకరమా = జగత్తును సృష్టించుట మొదలకు రూపమున ఉండు కర్మలు కలవాడు
మహాతేజాః = సూర్యాది తేజస్సులను నియమించునట్టి తేజస్సు కలవాడు
మహోరగః = గొప్పవగు సర్పములను దాసులుగా కలవాడు, శేషుడు, కాళీయుడు
మహాక్రతుః = గొప్ప ఙ్ఞానరూపమున ఉండువాడు
మహాయజ్వా = గొప్పవారు యఙ్ఞములు యెవరి కొరకు జరుగునో అతను
మహాయఙ్ఞః = ఎవరి గురించి గొప్ప యఙ్ఞములు జరుగునో అతను
మహాహవిః = యఙ్ఞములందు హవిస్సును స్వీకరించు మహాత్ముడు / భక్తుల కష్టాలను తొలగించువాడు

73. స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః

స్తవ్యః = స్తోత్రం చేయుతకు తగినవాడు
స్తవప్రియః = స్తోత్రమునందు ప్రీతి కలవాడు
స్తోత్రం = స్తుతింపబడువాడు
స్తుతిస్తోతా = భక్తులచే చేయబడు స్తోత్రాదులను అభినందించువాడు
రణప్రియః = యుద్ధం అంటే ఇష్టమైనవాడు
పూర్ణః = పూర్ణుడు
పూరయితా = భక్తుల యోగ్యతను బట్టి కోర్కెలను తీర్చువాడు
పుణ్యః = పవిత్రము చేయువాడు
పుణ్యకీర్తిః = పుణ్యమైన కీర్తికలవాడు
అనామయః = రోగములు లేనివాడు

74. మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రదః
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః

మనోజవః = మనసుకు గల వేగము వంటి వేగము కలవాడు
తీర్ధకరః = శాస్త్రములను రచించినవాడు
వసురేతాః = వసు - నీరు, ధనము, మణి, రేతాః - వీర్యము కలవాడు
వసుప్రదః = ధనమును, మణులను భక్తులకు ఇచ్చువాడు
వసుప్రధః = వసువు యొక్క అవతారమైన భీష్ముడిని (అర్జునిని కొరకు) బలముగా ఖండించినవాడు
వాసుదేవః = వసువులకు దేవుడు భీష్ముడు, అతనికి స్వామి
వసుః = నివసించువాడు
వసుమనాః = వసు అను పేరు కల రాజు యొక్క మనసు ఎవరి వద్ద ఉండునో అతను
హవిః = ఆహ్వానించుబడువాడు

0 వినదగు నెవ్వరు చెప్పిన..: