Tuesday, July 19

శ్రీవిష్ణు సహస్రనామము (75 - 93)

75. సద్గతి స్సత్కృతి సత్త సధ్భూతి సత్పరాయణః
శూరశేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః

సద్గతిః = సత్-సత్పురుషులకు, గతి-సత్తా ఇచ్చువాడు

త్కృ: = మంచి ప్రయత్నము కలవాడు
సత్తా = ఆనందమును కలిగించువాడు
సద్భూతిః = సత్-మంచిదైన, భూతిః-ఐశ్వర్యము కలవాడు
సత్పరాయణః = సత్-సత్పురుషులకు, పరాయణుడు-ఆశ్రయమైనవాడు
శూరశేనః = జరాసంధాదులను నిగ్రహించినవాడు

యదుశ్రేష్ఠః = యాదవవంశంలో శ్రేష్ఠుడు

సన్నివాసః = సద్గుణములు ఇతని యందు నివసించుచ్చున్నవి

సుయామునః =యమునః- కాళియుని వెడలగొట్టుటచే ఎవని వలన యమునలో నీరు , సు - నిర్మలంగా చేయబడినదో అతను, కృష్ణుడు


76. భూతావాసో వాసుదేవ స్సర్వాసు నిలయోనలః

దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో ధా పరాజితః


భూతావాసః = ప్రాణి రక్షకుడు

వాసుదేవః = వా-ఙ్ఞానము కొరకు జన్మించిన, అసుదేవః-వాయు జనకుడు

సర్వాసునిలయః = అన్ని ప్రాణులకు ఆశ్రయమైనవాడు
అనలః = భక్తుల అభీష్టములను తీర్చువాడు

దర్పహా = రాక్షసుల యొక్క గర్వమును నశింపచేయువాడు

దర్పదః = దర్ప-గర్వమును, దః-ఖండించువాదు
దృప్తః = గర్వించినవాడు
దుర్ధరః = ధరించుటకు వీలు కానివాడు
అపరాజితః = ఓటమి లేనివాడు

77. విశ్వమూర్తి ర్మహామూర్తి ర్దీప్తమూర్తి రమూర్తిమాన్
అనేకమూర్తి రవ్యక్త శ్శతమూర్తి శ్శతాననః


విశ్వమూర్తి = విశ్వ-వాయువు, మూర్త్య్-శరీరముగా కలవాడు

మహామూర్తి = విరాట్ రూపమైన పెద్ద ఆకారం కలవాడు
దీప్తమూర్తిః = ప్రకాశవంతమైన ఆకారం కలవాడు

అమూర్తిమాన్ = ప్రాకృతమైన రూపం లేనివాడు
అనేకమూర్తిః = వివిధ రూపములు కలవాడు

అవ్యక్తః = అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని తెలుపుటకు వీలులేనివాడు
శతమూర్తిః = శత-అసంఖ్యాకమైన, మూర్తిః=రూపములు కలవాడు
శతాననః = శత-అనేకమైన, ఆననః-ముఖములు కలవాడు

78. ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం
లోకబందు ర్లోకనాధో మాధవో భక్తవత్సలః

ఏకః = ఒంటరివాడు

నైకః = పెక్కు రూపములు కలవాడు
సవః = యఙ్ఞ పురుషుడు
కః = ప్రకాశించువాడు
కిం = పురాణాది శబ్ద రూపకర్త

యత్ = తెలిసికొనువాడు
తత్ = కనపడనందు వలన "అది" లేక "అతడు" అని పిలువబడువాడు

పదం = చేరబడునది
అనుత్తమం = ఉత్తములకంటే శ్రేష్టుడు
లోకబంధుః = లోకములకు బంధువు
లోకనాధః = లోకములకు నాధుడు
మాధవః = మధువు - తేనెకు(సంతోషానికి గుర్తు తీపి) సంబంధించినవాడు / ఆనందస్వరూపుడు
భక్తవత్సలః = భక్తులను బిడ్డలవలె దగ్గరకు తీయువాడు

79. సువర్ణవర్ణో హేమాంగో వరాంగ శ్చదనాంగదీ
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః

సువర్ణవర్ణ = బంగారురంగు కలవాడు

హేమాంగః = బంగారుమయములైన అంగములు కలవాడు

వరాంగః = వర-ఉత్తమమైన, అంగః - అంగములు కలవాడు
చందనాంగదీ = చందన - చందనమును, అంగదా-బాహు భూషణమును కలవాడు
వీరహా = వీ-విగతమైన, ఈర-ప్రాణము కలవారు-రాక్షసులు, హా-చంపువాడు
విషమః = విష-రుద్రుడు త్రాగిన విషమును, మః=నామస్మరణచేత నశింపచేయువాడు
శూన్యః = ప్రళయకాలమందు అంతా తానైన వాడు
ఘృతాశీ = ఘృతము-నెయ్యి వంటి హోమ పదార్ధములు, శీ-ఇష్టము కలవాడు
అచలః = కదలనివాడు
చలః = కదులువాడు

80. అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్

సుమేధా మేధజో ధన్య స్సత్యమెధా ధరాధరః

అమానీ = విషయములందు అభిమానము లేనివాడు

మానదః = లక్ష్మి కొరకు వాయువును పుత్రరూపంగా ఇచ్చువాడు
మాన్యః = స్వయం ప్రేరకుడు
లోకస్వామి = లోకములకు యజమాని
త్రిలోకదృత్ = త్రిలోకములను ధరించువాడు

సుమేధాః = మంచి మేధ కలవాడు

మేధజః = యఙ్ఞమునందు జన్మించినవాడు

ధన్యః = సుకృతులు కలవాడు

సత్యమేధా = సత్యమైన ఙ్ఞానము కలవాడు
ధరాధరః = భూమి యొక్క ధారకుడు

81. తేజోవృషో ద్యుతిధర స్సర్వశస్త్రభృతాంవరః

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః

తేజోవృషః = తేజః - తేజోరూపమున ఉండు, వృషః-శ్రేష్టుడు, వామనుడు

ద్యుతిధరః = కాంతిని ధరించినవాడు

సర్వశస్త్రభృతాంవరః = సర్వ శస్త్రములను, ఆకాశమును భరించువాడు
ప్రగ్రహః = నవగ్రహములు ఎవనిచే శక్తిమంతముగా చేయబడుచ్చున్నవో అతను
నిగ్రహః = అణచివేయువాడు

అవ్యగ్రః = మనసు చెదరనివాడు
నైకశృంగః = వృషరూపంలో ఉన్న ఎవరికైతే ఎక్కువ కొమ్ములు కలవో అతను / వృషరూపి ఐన అగ్ని కి కల 4కొమ్ములు ఇక్కడ ప్రస్తావించబడినది

గదాగ్రజః = గదుడు అను వానికి సోదరుడు


82. చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేదవి దేకపాత్

చతుర్మూర్తిః = విశ్వ, తైజస, ప్రాఙ్ఞ, తురీయ అను పేరు కల రూపం కలవాడు

చతుర్బాహుః = 4 చేతులు కలవాడు

చతుర్వ్యూహః = కేశవ, త్రివిక్రమ, సంకర్షణ, నారసింహ అను 4 రూపములు కలవాడు
చతుర్గతిః = ఆర్తుడు, జిఙ్ఞాసువు, అర్ధార్ధి, ఙ్ఞాని అను నలుగురు భక్తులకు గతియగు వాడు

చతురాత్మా = ధర్మార్ధ కామ మోక్షముల యందు మనసు కలవాడు
చతుర్భావః = బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల వారిని ఉత్పాదింపచేయువాడు
చతుర్వేద విదేకపాత్ = 4 వేదములచే తెలుసుకొనదగినవాడు


83. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతి క్రమః
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః

సమావర్తః = సమభావంతో అన్ని వైపులా ఉండువాడు

అనివృత్తాత్మా = అయోగ్యులు చేసిన యఙ్ఞ యాగాదులనుండి మరలిన మనసు కలవాడు

దుర్జయః = గెలుచుటకు శక్యము కానివాడు
దురతిక్రమః = దుఖమును దాటినవాడు

దుర్లభః = దొరుకుటకు కష్టమైనవాడు
దుర్గమః = సమీపించుటకు వీలులేనివాడు
దుర్గః = రాక్షసులకు దుఖము కలిగించువాడు
దురావాసః = భగవంతుడు నిర్గుణుడు అని వాదించువారిని నరకాదులలో పడవేయువాడు
దురారిహా = దుష్టులైన సతృవులను చంపువాడు

84. శుభాంగో లోకసారంగ స్స్తంతు స్తంతు వర్ధనః
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః

శు
భాంగః = శుభములైన అంగములు కలవాడు
లోకసారంగః = వైకుంఠాది లోకములను ఇచ్చువాడు, ఙ్ఞానులను రంజింపచేయువాడు

సుతంతుః = శోభనమైన చతుర్ముఖాది సంతానము కలవాడు
తంతువర్ధనః = ద్రౌపతి యొక్క మానరక్షకుడు

ఇంద్రకర్మా =ఇంద్రుడూను, కర్మనూ
మహాకర్మా = జగత్తును సృష్టించుట మొదలగు కర్మలు కలవాడు
కృతకర్మా = పూర్తిచేయబడిన కర్మ కలవాడు
కృతాగమః = ఎవనిచే వేదములు నిర్మించబడినవో అతను

85. ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభః స్సులోచనః

అర్కో వాజసనః శృంగీ జయంత స్సర్వవి జ్జయీ

ఉద్భవః = భవ-సంసారమునుండి ఉత్-వెలుపల ఉండువాడు
సుందరః = సౌదర్యవంతుడు
సుందః = సుఖమును ఇచ్చువాడు
రత్ననాభః = రత్న-పుమ్రత్నమైన చతుర్ముఖుడు, నాభః-నాభియందు కలవాడు

సులోచనః = అందమైన కన్నులు కలవాడు

అర్కః =అతిశయమైన సుఖస్వరూపుడు
వాజసనః = వాజ-అన్నము, సనః-పొందువాడు

శృంగీ = గోవర్ధన శృంగములు కలవాడు
జయంతః = గెలుచువాడు
సర్వవిజ్జయీ = సర్వ విదుల యొక్క జయప్రాప్తి కలవాడు


86. సువర్ణబిందు రక్షోభ్యస్సర్వ వాగీశ్వరేశ్వరః

మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః

సువర్ణబిందుః = బగారములైన అక్షరములు వేనియందు ఉండునో (వేదములు), దానిని తెలుసుకొన్నవాడు

అక్షోభ్యః = క్షోభింపచేయుటకు వీలుకానివాడు
సర్వవాగీశ్వరేశ్వరః = సమస్త వాక్కులకు నియామకుడైనవాడు రుద్రుడు, అతనికి యజమాని

మహాహ్రదః = పెద్దదైన జలస్థానము కలవాడు
మహాగర్తః = పెద్దవైన కొండలయందు చేరువాడు, ఏడుకొండలవాడు
మహాభూతః = పంచభూతములు ఎవరినుండి వచ్చునో అతను

మహానిధిః = గొప్పదైన నిధి దొరికినంత సంతోషము కలిగించువాడు

87. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః
అమృతాంశో మృతవపుః సర్వఙ్ఞ స్సర్వతో ముఖః


కుముదః = భూమియందు సంతోషించువాడు

కుందరః = భక్తులు సమర్పించు మల్లె పూలతో రమించువాడు/సంతోషించువాడు
కుందః = కుత్సితమును ఖండించువాడు
పర్జన్యః = పర్-గొప్పదైన, జన్యః-యుద్ధము ఎవనివలనో అతను

పావనః = పవిత్రము చేయువాడు

అనిలః = అని-వాయుభక్తులు, లః - గ్రహించువాడు
అమృతాంశః = అమృత-ముక్తులు, ఆశా-ఎవనిని గురించి కోరిక ఉండునో అతను
అమృతవపుః = అమృత - అమృతం కొరకు నారాయణి, వపుః-రూపం కలవాడు
సర్వఙ్ఞః = అన్ని విషయములు తెలిసినవాడు
సర్వతోముఖః = అన్ని వైపులా ముఖములు కలవాడు

88. సులభ స్సువృత స్సిద్ధ శ్శతృజి చ్చత్రుతాపనః

న్యగ్రోధో దుంబురో శ్వత్ధ శ్చాణూరాంధనిషూదనః

సులభః = సుఖముగా దొరుకువాడు

సువృతః = శోభనమైన వ్రతము ఎవరి గురించి చేయునో అతను
సిద్ధః = మంగళమును, శాస్త్రమును ధరించువాడు

శత్రుజిత్ = శతృవులను జయించువాడు

శత్రుతాపనః = శతృవులను బాధించువాడు

న్యగ్రోధోదుంబరః = ఉత్క్రుష్ట క్షత్రియ మదమును నశింపచేయువాడు
అశ్వత్ధః = గుఱ్ఱము వలె ఉండువాడు, హయగ్రీవుడు

చాణూరాంధనిషూధనః = చాణూర-చాణూరుడు అను పేరు కల ఆస్థానమునందలి మల్లుని, అంధః-అంధునకు చెందిన(దృతరాష్ట్రుడు) ధుర్యోదనాదులను, నిషూదనః - చంపినవాడు

89. సహస్రార్చి స్సప్త జిహ్వ స్సప్తైధ స్సప్త వాహనః

అమూర్తి రంఘో చింత్యో భయకృ ద్భయనాశనః

సహస్రార్చిః = అనేక కిరణములు కలవాడు

సప్తజిహ్వః = 7జడలుగల ఋషులే జిహ్వగా కలవాడు

సప్తైధాః = సప్తఋషులను పెంపొందింపచేయువాడు

సప్తవాహనః = 7 గుఱ్ఱములు వాహనములుగా కలవాడు, సూర్యుడు

అమూర్తిః = ప్రాకృతమైన దేహములేనివాడు
అనఘః = పాపములేనివాడు

అచింత్యః = చింతపడుటకు వీలులేనివాడు
అభయకృత్ = భక్తులకు అభయమిచ్చువాడు
భయనాశనః = భయమును పొగ్గొట్టువాడు

90. అణు ర్బృహ త్కృశ స్స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః


అణుర్బృహత్ = అణువుగా మరియు బృహద్రూపం కలవాడు

కృశః = రాక్షసులను నశింపచేయువాడు

స్థూలః = మహాపరిణామం కలవాడు

గుణబృత్ = అనందాది గుణములను భరించువాడు
నిర్గుణః = సత్త్వాది గుణములు లేనివాడు

మహాన్ = శ్రేష్టుడు

అధృతః = ఎవనిచేత ధరించుటకు వీలులేనివాడు
స్వధృతః = తనచేతనే తాను ధరింపబడువాడు
స్వాస్యః = వేదములు ఎవని నోటి యందు ఉన్నవో అతను
ప్రాగ్వంశః = అనాదికాలమునుండి ఆధారభూతమైనవాడు
వంశవర్ధనః = పరీక్షితుడిని రక్షింపుటచే, పాండు వంశమును అభివృద్ధి పరచినవాడు

91. భారభృత్ కధితో యోగీ యోగీశ స్సర్వకామదః
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః

భారభృత్ =భారభూతమైన బ్రహ్మాండమును భరించిన్వాడు, కూర్మావతారం

కధితః = సదాగమములచేత ప్రతిపాదించబడినవాడు

యోగీ = ఉపాయము కలవాడు
యోగీశః = యోగులకు ఈశుడు
సర్వకామదః = భక్తులందరియొక్క కోర్కెలను తీర్చువాడు
ఆశ్రమః = శ్రమలేనివారు
శ్రమణః = సన్యాసులు ఇతనికి దాసులైనారు కావున
క్షామః = సహనశక్తికి ఆధారుడైనవాడు
సుప్రణః = మంచి మఱ్ఱి ఆకు శయనముగా కలవాడు, వటపత్రశాయి

వాయువాహనః = వాయువును వర్తింపచేయువాడు

92. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః

అపరాజిత స్సర్వసహో నియంగా నియమో యమః


ధనుర్ధరః = ధనస్సును ధరించినవాడు

ధనుర్వేదః = ధనుః-ఇంద్రుని ధనస్సును అగస్త్యుని ద్వార, వేదః-పొందినవాడు

దండః = దైత్యులను దండించినవాడు

దమయితా = దైత్యులను అణగద్రొక్కువాడు
ఆదమః = బాగుగా ఇచ్చువారికి సంపద ఎవరివలన కలుగునో అతను
అపరాజితః = సర్వోత్తముడు
సర్వసహః = అన్నింటిని ఓర్చుకొనువాడు

నియంతా = నియామకుడు

నియమః = మిక్కిలి శాచించువాడు
యమః = ప్రళయకాలమున సర్వమును తనయందు కలిగినవాడు

93. సత్వవాన్ సాత్త్విక స్సత్య స్సత్యధర్మపరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృ త్ప్రీతివర్ధనః

సత్వవాన్ = మంచితనము కలవాడు

సాత్త్వికః = శుద్ధ సత్త్వ ప్రధానుడైన చతుర్ముఖుడు దాసుడుగా కలవాడు
సత్యః = స్వతంత్రుడు

సత్య ధర్మ పరాయణః = సత్య విషయమైన ధర్మము కలవారికి ముఖ్యాశ్రయమైనవాడు

అభిప్రాయః = అభి-అన్ని వైపులా, ప్ర-పూరించునది, అభిప్రా-లక్ష్మి, ఆమెను సంతోషపరచువాడు

ప్రియార్హః = సుఖమునకు అర్హత కలిగినవాడు

అర్హప్రియకృత్ =అర్హులైన భక్తుల అభీష్టములను ఇచ్చి రక్షించువాడు

ప్రీతివర్ధనః = భక్తులయందు ఇష్టమును పెంపొందించువాడు

0 వినదగు నెవ్వరు చెప్పిన..: