Thursday, September 29

దేవీ నవరాత్రులు

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం అనుసృతంగా వస్తున్న సంప్రదాయం. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుకనే.

అమ్మవారి అలంకారములు :
మొదటిరోజు బాలాత్రిపుర సుందరీదేవి
రెండోరోజు గాయత్రీ అమ్మవారు
మూడోరోజు అన్నపూర్ణాదేవి
నాల్గవరోజు లలితా త్రిపురసుందరి
అయిదవరోజు సరస్వతీదేవి (మూలా నక్షత్రం వచ్చినప్పుడు)
ఆరో రోజు మహాలక్ష్మి
ఏడవరోజు దుర్గాదేవి
ఎనిమిదవరోజు మహిషాసుర మర్ధిని
తొమ్మిదవరోజు రాజరాజేశ్వరీ అమ్మవారు

నైవేద్యము :
బాలాత్రిపుర సుందరీదేవి - పొంగలి
గాయత్రీ మాత - పులిహోర
అన్నపూర్ణాదేవి - కొబ్బరన్నం
లలితా త్రిపురసుందరి - గారెలు
సరస్వతీదేవి - పెరుగన్నం
మహాలక్ష్మిదేవి - రవకేసరి
దుర్గాదేవి - కదంబం - అన్నికూరలు అన్నం కలిపి వండే వంటకం
మహిషాషురమర్ధిని - బెల్లంతో చేసిన వంటకం
రాజరాజేశ్వరి అమ్మవారు - పరమాన్నం

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

KRRAO said...

చాలా బాగుంది అమ్మా మీ బ్లాగు. ఇలాగే కొనసాగించండి.
భాస్కరానందనాధ / 10-10-2012
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.
శ్రీకాళహస్తి., చిత్తూరు (ఆ.ప్ర); Cell # +919959022941; Land line – 08578-286077
http://srilalithaparabhattarika.blogspot.in/
http://vanadurga-mahavidya.blogspot.in/

గాయత్రి said...

ధన్యవాదములు