Thursday, May 5

కూర్మావతారం


ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాలని స్నేహపూర్వకంగా ఇస్తాడు. సహజంగానే గర్వము, అహంకారము ఉన్న ఇంద్రుడు ఆ మాలని వాహనమైన ఐరావతం కి వేసాడు. గజరాజు ఆ మాలని తన కాలిక్రింద వేసి తొక్కడంతో కోపోద్రేకుడైన మహర్షి, " దేవతల వద్దనున్న సిరిసంపదలు నశిస్తాయి " అని శాపం ఇస్తాడు. దేవతలందరు కలిసి విష్ణుదేవుని వద్ద మొరపెట్టుకోగా, మహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు " సముద్ర మదనం చేస్తే వచ్చిన నిధితో దేవలోకానికి ఎటువంటి కొరత ఉండదు. పైగా సాగర మదనం ద్వార వచ్చే అమృతంతో దేవతలు చిరంజీవులుగా, శక్తిమంతులుగా ఉంటారు, ఆ మదనానికి అసురుల సహాయం కోరండి" అని దేవేంద్రునితో చెప్తాడు. అమృతాన్ని అసురులకు కూడా పంచుతాము అని, అసురులకు చెప్పడం ద్వార, వారి సహాయంతో సాగరమదనానికి పూనుకొన్నారు.
మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకి ని తాడుగా చేసుకొని, వాసుకి తలవైపు సురులు, వెనుకవైపు అసురులు పట్టుకొని సాగరమదనం చేసారు. ఆ మహా పర్వతానికి ఆలంబనగా ఉం
టానికి ఏదైన తక్కువే, అంతటి భారాన్ని మోయడానికి సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కూర్మరూపం దాల్చి ఆలంబనగా నిలిచాడు. మదనంలో మొదటగా హలాహలం, లక్ష్మీ దేవి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము చివరకు అమృతము వచ్చాయి. మోహినీ అవతారంలో అమృతాన్ని అసురల బారినపడకుండా సురులుకి పంచుతాడు మాహావిష్ణువు.

కూర్మావతారంలో వెలసిన ఆ విష్ణుమూర్తి ని మనం "శ్రీకూర్మం (వైజాగ్)" లో దర్శించుకోవచ్చు.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: