Saturday, May 7

సింహాచల అప్పన్న నిజరూపదర్శనం (చందనోత్సవం)


ఉగ్రరూపుడైన నరసింహ స్వామి 12మణుగుల శ్రీచందనంలో ఏడాది పొడవునా దాగి ఉంటారు. హిరణ్యాక్షుడి సంహారం తర్వాత, ఆ ఉగ్రరూపంతోనే ఈ కొండపై స్వామి అవతరించారని పురాణ కధనం. ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్ల తదియ నాడు నిజరూప దర్శనం ఇస్తారు స్వామి. సిం హాచలంలో తెల్లవారుఝామున ఒంటిగంట నుండి అర్చకులు వైధిక కార్యక్రమాలు నిర్వహించి, స్వామిపై ఉన్న చందనాన్ని వెండి బొరిగలతో తొలగిస్తారు. నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి తొలివిడతగా 3మణుగుల గంధం సమర్పిస్తారు. అనంతరం వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలలో మరో మూడేసి మణుగుల గంధం సమర్పిస్తారు. శ్రావణ పౌర్ణమినాడు కరాళ చందన అలకరణ జరుగుతుంది. ఏడాదికి 12మణుగుల గంధం స్వామివారికి సమర్పిస్తారు. ఇది సంప్రదాయం. దానితో పాటు పాత్తు వస్త్రాన్ని సమర్పిస్తారు.
ప్రతీ ఏడాది వైశాఖ బహుళ ఏకాదశినాడు గంధం చెక్కల అరగతీత మొదలుపెడ్తారు. ఈ చెక్కలను తిరుపొత్తూరు నుండి తెస్తారు.



0 వినదగు నెవ్వరు చెప్పిన..: